For Money

Business News

మళ్ళీ పెరగనున్న మొబైల్ టారిఫ్‌లు

వొడాఫోన్‌ను పూర్తి ముంచిన తరవాత ఇక టెలికాం రంగంపై ఎయిర్‌టెల్‌, జియోది గుత్తాధిపత్యంగా మారింది. గత ఏడాది నవంబర్ ప్రిపెయిడ్‌ టారిఫ్‌లను 20 శాతంపైగా పెంచింది ఎయిర్‌టెల్‌. తరవాత రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ కూడా అదే పనిచేశాయి. 2020 సగటు వినియోగదారు నుంచి ఎయిర్‌టెల్‌కు నెలకు వచ్చిన మొత్తం రూ. 143 కాగా, ఇపుడు రూ.163కి చేరింది. దీన్ని రూ. 200లకు పెంచేందుకు కూడా తాము వెనుకాడబోమని, టారిఫ్‌ పెంచడంలో తాము ముందు ఉంటామని ఎయిర్‌టెల్‌ కంపెనీ సీఈఓ గోపాల్ విట్టల్‌ అన్నారు. మూడు, నాలుగు నెలల్లో మరో పెంపుదల ఉంటుందని ఆయన చెప్పారు.