For Money

Business News

మళ్ళీ వంటనూనెల మంట

గత ఏడాది పండుగల సీజన్‌లో పది రూపాయలు తగ్గితేనే ప్రభుత్వం వరుస ప్రతికా ప్రకటనలతో ధరలు తగ్గినట్లు డబ్బా కొట్టింది. కొత్త ఏడాదిలో మళ్ళీ వంటనూనెల ధరలు పెరుగుతుంటే కిమ్మనడం లేదు. ప్రపంచంతో పాటు మనదేశంలోకూడా అత్యధికంగా జనం వాడే నూనెలో పామాయిల్‌ ప్రధానమైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే 40 రోజుల్లోనే ఈ నూనె ధర 15 శాతం పెరిగింది. దీనితో పాటు పోటీగా అత్యధికంగా అమ్ముడుబోయే సోయాబీన్‌ ఆయిల్‌ ధర కూడా 12శాతం పెరిగింది. దీంతో ఇతర ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పాయమాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయిని తాకుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో పెంచక తప్పడం లేదని కంపెనీలు అంటున్నాయి. గడచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా డిసెంబర్‌ నెలలో ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం కూడా సుంకాలు తగ్గించినా… అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా వాటి ధరలను కట్టడి చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది.