For Money

Business News

17450పైన ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల జోరుతో మన మార్కెట్లూ లాభాల్లో దూసుకుపోయాయి. నిఫ్టి దిగువకు వచ్చినపుడుల్లా 17360పైన మద్దతు లభించడంతో టెక్నికల్‌ అనలిస్టులు కూడా కొనుగోళ్ళకు సిఫారసు చేశారు. మిడ్‌ సెషన్‌ వరకు హెచ్చతగ్గుల్లో ఉన్న నిఫ్టి.,.. మిడ్ సెషన్‌కు ముందు చల్లబడింది. అయితే యూరో మార్కెట్లు ఓపెనింగ్‌లో భారీ లాభాలతో ట్రేడ్‌ కావడంతో… మన మార్కెట్లలో మద్దతు అందింది. 17,360పైన షార్ట్‌ కవరింగ్‌ భారీగా రావడంతో క్లోజింగ్‌ వరకు నిఫ్టి పెరుగుతూనే ఉంది. రేపు వీక్లీ డెరివిటేవ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున… ఇవాళ్టి ట్రేడ్‌లో విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం రేపు బయపడనుంది. ఒకదశలో 17,477ని తాకిన నిఫ్టి 197 పాయింట్ల లాభంతో 17,463 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ నిఫ్టి సూచీ 1.56 శాతం లాభపడింది.
ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, ఐటీ, మెటల్‌, ప్రైవేట్‌ షేర్ల సూచీలు బాగా పెరిగాయి.