For Money

Business News

ఏసీసీ నికర లాభం 40 శాతం డౌన్‌

పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాలో ఆటంకాలు, డిమాండ్‌ ఆశించిన స్థాయలో లేకపోవడం… ఈ కారణాల వల్ల డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏసీసీ నికర లాభం రూ. 280 కోట్లకు క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న నికర లాభం రూ. 472 కోట్లతో పోలిస్తే… తాజా త్రైమాసికంలో 40 శాతం క్షీణించిందన్నమాట. ఇక ఆదాయం మాత్రం 2 శాతం పెరిగి రూ.4225 కోట్లకు చేరింది.2020 త్రైమా
సికంతో పోలిస్తే తాజా మూడునెలల్లో సిమెంట్‌ అమ్మకాలు కూడా 77.10 లక్షల టన్నుల నుంచి 74.9 లక్షల టన్నులకు క్షీణించింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ కూడా 0.64 శాతం క్షీణించి 13.16 శాతానికి తగ్గింది. మార్కెట్‌ అనలిస్టులు మాత్రం రూ. 4220 కోట్ల అమ్మకాలపై రూ. 440 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా వేశారు. అయితే మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో కంపెనీ విఫలమైంది.