For Money

Business News

5 నుంచి ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూ

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.21,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ అక్టోబరు 5న ప్రారంభం కానుంది. ఈ నెల 28నాటికి కంపెనీ ఖాతాల్లో నమోదు చేసుకుని ఉన్న ఇన్వెస్టర్లు ఈ రైట్స్‌కు అర్హులు రికార్డు తేదీగా నిర్ణయించినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. అంటే రికార్డు తేదీ ఈనెల 28 అన్నమాట. రైట్స్‌ ఇష్యూ అక్టోబర్‌ 21వ తేదీన ముగుస్తుంది. రైట్స్‌ ఇష్యూలో ఒక్కో షేరుకు ప్రీమియంతో కలిపి రూ.535గా ధరకు కంపెనీ షేర్లను ఆఫర్‌ చేస్తోంది. అర్హులైన వాటాదార్లకు తమ వద్ద ఉన్న ప్రతి 14 షేర్లకు ఒక షేరును రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆఫర్‌ చేస్తున్నారు. కంపెనీలో ప్రమోటర్‌ వాటా 55.8 శాతం ఉండగా, పబ్లిక్‌ వాటా 44.09 శాతంగా ఉంది.