For Money

Business News

ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా IPO

రిటైల్‌ సంస్థ ‘బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌’ను నిర్వహించే మాతృ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రానుంది. మార్కెట్‌ నుంచి రూ.500 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది. ఇందులో రూ.138.8 కోట్లను కపంఎనీ విస్తరణ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. మరో రూ.200 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ.50 కోట్లను రుణాలు తీర్చడానికి ఉపయోగించనుంది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న పనిచేస్తున్న ఈ సంస్థకి 90కి పైగా విక్రయ కేంద్రాలు ఉన్నాయి. కిచెన్‌ స్టోరీస్‌ పేరుతో ప్రత్యేకంగా వంటగది అవసరాల కోసం రెండు కేంద్రాలున్నాయి. ఇలాంటి ప్రత్యేక స్టోరును ఆడియా, హోం ఆటోమేషన్‌ విభాగంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో పవన్‌ కుమార్‌ బజాజ్‌, కరణ్‌ బజాజ్‌ స్థాపించిన ఈ కంపెనీ కోటి మందికి పైగా ఖాతాదారులతో భారత్‌లో నాలుగో స్థానంలో ఉంది. 7.5 లక్షల చదరపు అడుగుల రిటైల్‌ స్పేస్‌లో 90 స్టోర్‌లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.