For Money

Business News

హరిఓమ్‌ పైప్‌ పబ్లిక్‌ ఆఫర్‌

హైదరాబాద్‌కు చెందిన మరో కంపెనీ హరిఓమ్‌ పైప్‌ ఇండస్ట్రీస్‌ (హెచ్‌పీఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఐపీఓ ద్వారా రూ.100-120 కోట్ల సమీకరణకు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్లను జారీ చేయనుంది. 2019 అక్టోబరు నాటికి కంపెనీకి 6 తయారీ యూనిట్లు ఉన్నాయి. 2007లో నెలకొల్పిన ఈ కంపెఈ వార్షిక స్థాపిత సామర్థ్యం దాదాపు 2.41 లక్షల టన్నులు. 51,943 టన్నుల వార్షిక సామర్థ్యంతో హైదరాబాద్‌లోని సంగారెడ్డిలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. విస్తరణ ప్రాజెక్టుతో పాటు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం పబ్లిక్‌ ఇష్యూ నిధులను వినియోగించనున్నారు. గత మార్చితో ముగిసిన ఏడాదిలో ఈ కంపెనీ రూ. 254.82 కోట్ల టర్నోవర్‌పై రూ. 15.13 కోట్ల నికర లాభం ఆర్జించింది.