For Money

Business News

ధారవి ప్రాజెక్టు అదానీకి

ఆసియాలోని అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అదానీ గ్రూప్‌ చేతికి వచ్చింది. ఈ మురికవాడను అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కోసం బిడ్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.మొత్తం మూడు బిడ్లు వచ్చాయని.. అందులో నమన్‌ గ్రూప్‌ వేసిన బిడ్‌ టెక్నికల్‌ బిడ్డింగ్‌లో నిలబడలేకపోయింది. దీంతో బరిలో రెండు కంపెనీలు నిలిచాయి. ఒకటి అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ప్రాపర్టీస్‌ కాగా, రెండోది డీఎల్‌ఎఫ్‌. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూప్‌ రూ. 5069 కోట్లు బిడ్‌ వేయగా, డీఎల్‌ఎఫ్‌ కంపెనీ బిడ్‌ విలువ రూ. 2025 కోట్లు. అంటే అదానీకి ఈ బిడ్డింగ్‌లో తిరుగులేకుండా పోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ బిడ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధారవి రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుకు రూ. 20,000 కోట్లు ఖర్చు అవుతుదని అంచనా. ఎవరైతే ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెడతారనే దానిని బట్టి బిడ్డర్‌ను ఎంపిక చేస్తారు. రూ. 5069 కోట్లు పెడతానని బిడ్‌ వేయడంతో అదానీ గెలిచింది. ఈ ప్రాజెక్టును 17 ఏళ్ళలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్నవారికి ఏడేళ్ళలో పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద ఒక కోటి చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి రానుందని అంచనా.