For Money

Business News

మెటల్‌ వ్యాపారంలోకి అదానీ

అదానీ గ్రూప్‌ చాలా వేగంగా భిన్నం రంగాల్లోకి విస్తరిస్తోంది. ఇటీవలే ఆరోగ్య రంగంలోకి అడుగు పెట్టిన అదానీ గ్రూప్‌ ఇపుడు మెటల్స్‌ వ్యాపారంలోకి దిగుతోంది. గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కాపర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌.. కచ్‌ కాపర్‌ లిమిటెడ్‌ (కేసీఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ తొలి దశకు రూ.6,070 కోట్ల రుణ సాయం చేసేందుకు ఎస్‌బీఐ నాయకత్వంలో ఏడు బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 5 లక్షల టన్నులు. తొలిదశ 2024వ సంవత్సరం ప్రథమార్థంలో ప్రారంభమౌతుందని తెలుస్తోంది. నిధుల సమీకరణ పూర్తవడంతో ముంద్రాలో ఈ ప్లాంట్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.