For Money

Business News

మంత్రి డెవలపర్స్‌ సీఎండీ అరెస్ట్‌

దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుషీల్‌ మంత్రిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి డెవలపర్స్‌ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసినవారు చాలా మంది కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఆకాశరామన్న ఉత్తరంలో ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.గత కొన్ని రోజుల నుంచి మంత్రి డెవలపర్స్‌పై నిఘా వేసిన ఈడీ అధికారలు.. ఫ్లాట్ల కోసం తీసుకున్న సొమ్మును తమ సొంత కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే బ్యాంకుల నుంచి రూ. 5000 కోట్ల రుణం తీసుకున్నారని.. ఇంకా రూ.1000 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్‌ సంబంధించి మంత్రి డెవపలర్స్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా సుశీల్‌ మంత్రిని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. విచారణ కోసం ఆయనకు సమన్లు పంపామని, విచారణ తరవాత అతన్ని మనీలాండరింగ్ యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద ఆయనను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.2020లో మంత్రి డెవలపర్స్‌పై ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మార్చి 22 నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఒకే ప్రాజెక్టును పలు బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.జూన్‌ 24వ తేదీన సుశీల్‌ మంత్రిని విచారించగా.. సరైన సమాధానాలు చెప్పలేదని, చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఈడీ అధికారులు అన్నారు. కంపెనీకి చెందిన చాలా సమాచారాన్ని దాచి పెడుతున్నారని, తాము చూపించిన డాక్యుమెంట్లకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఈడీ అధికారులు పేర్కొన్నారు.