అదరగొట్టిన వాల్‌స్ట్రీట్
చాలా రోజుల తరవతా వాల్‌స్ట్రీట్ దుమ్మురేపింది. ఇరాన్‌తో నేడు అమెరికా ఒప్పందం కుదురుతుందన్న వార్తలతో అన్ని రకాల షేర్లకు మద్దతు అందింది. అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, చిప్ షేర్లలో జోరు కొనసాగింది. నాస్‌డాక్ సూచీ ఏకంగా
2.6 శాతం లాభంతో క్లోజైంది. 1.7 శాతం పైగా లాభంతో S&P500, డౌజోన్స్ సూచీలు ముగిశాయి. ప్రధాన చిప్ షేర్లలో ఇవాళ ఒకే సెషన్‌లో పాలంటిర్ టెక్నాలజీస్ షేర్ 30% పెరిగింది. నెలరోజుల్లో ఈ షేర్ 50 శాతం పెరగడం విశేషం. స్కాన్‌డిస్క్, ఎన్‌విడియాతో ఆటు ఇతర చిప్ షేర్లు కూడా చక్కటి లాభాలు గడించాయి. లిస్టింగ్ తరవాత వచ్చిన స్పేస్‌ఎక్స్ ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపర్చాయి. షేర్ 8% క్షీణించింది. బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల దిగువకు రావడంతో మార్కెట్‌లో ఉత్సాహం పెరిగింది. అలాగు బులియన్ ధరలు కూడా పెరిగాయి.
