For Money

Business News

భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు మూడు శాతంపైగా పెరిగాయి. డౌజోన్స్‌ కూడా 2.63 శాతం లాభంతో ముగిసింది. ఇటీవలి కాలంలో అమెరికా ఈక్విటీ మార్కెట్‌లో కోలుకోవడం తొలిసారి. డాలర్‌ 104 దిగువకు రాగా, క్రూడ్‌ ఆయిల్‌ మాత్రం గ్రీన్‌లో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. చైనా మార్కెట్‌ లాభాలు ఒక శాతం లోపు ఉండగా, ఇతర మార్కెట్లు రెండు శాతం దాకా లాభంతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ 1.75 శాతం లాభంతో ట్రేడవుతుండగగా, హాంగ్‌సెంగ్ సూచీ2.2 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 170 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి కూడా భారీ లాభాలతో ప్రారంభం కానుంది.