For Money

Business News

15100పైన ముగిసిన నిఫ్టి

ఆటో, బ్యాంక్‌, ఫైనాన్స్‌ షేర్ల అండతో ఇవాళ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రోజంతా నిఫ్టి లాభాల్లోనే కొనసాగింది. డే ట్రేడర్స్‌ ఇవాళ పర్లేదు. పెరిగినపుడు అమ్మినవారికి, దిగువస్థాయిలో కొన్నవారికి లాభాలు పర్లేదు. కరోనా కేసులు రెండున్నర లక్షలకు తగ్గడంతో ట్రేడర్స్‌ భారీగానే కొన్నారు. మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా రెండు శాతం లాభపడింది. నిఫ్టిలో 42 షేర్లు లాభాలతో ముగిశాయంటేనే మార్కెట్‌ ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నా దేశీయ ఆర్థిక సంస్థలు భారీగానే కొంటున్నాయి. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా.. లాభాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డాలర్‌ భారీగా క్షీణించడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లు ఈ అంశాలను ప్రస్తుతానికి పట్టించుకోవడం లేదు.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎం అండ్‌ ఎం 797.05 5.77 బజాజ్‌ ఆటో 4,065.00 5.19 టైటాటాన్‌ 1,541.00 4.95
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,676.20 4.53
అదానీ పోర్ట్స్‌ 780.00 3.42

నిఫ్టి టాప్‌ లూజర్స్
భారతీ ఎయిర్‌టెల్‌ 536.80 -2.34
ఐటీసీ 210.20 -1.13
కోల్‌ ఇండియా 146.80 -0.91
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,218.00 -0.62
దివీస్‌ ల్యాబ్‌ 4,029.80 -0.33