For Money

Business News

15,100పైన నిఫ్టి

విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలోనూ నిఫ్టి పరుగులు తీస్తోంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15100ని దాటింది. ప్రస్తుతం 173 పాయింట్ల లాభంతో 15,096 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ మళ్ళీ 50,000 మార్క్‌ను దాటింది. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ షేర్ల సూచీలు దాదాపు రెండు శాతం మేర లాభాలతో ట్రేడవుతోంది. 50 శాతం మంది ఈఎంఐలు కట్టడం లేదని ఎన్‌బీఎఫ్‌సీలు అంటున్నాయని వార్తలు వస్తున్నా… ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కరోనా కేసులు భారీగా తగ్గడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడింది. అయితే ఇవాళ వచ్చిన డేటా ఆదివారంనాటిది కాబట్టి.. రేపటి కరోనా డేటా కీలకం కానుంది. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్ముతున్నారు. గరిష్ఠ స్థాయిలో వీరు బయటపడుతున్నారా? అన్న టెన్షన్‌ మార్కెట్‌లో ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
హిందాల్కో 406.50 3.45
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 980.85 2.55
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,567.60 2.53 టాటా స్టీల్‌ 1,179.70 2.51 ఐఓసీ 104.10 2.06

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బ్రిటానియా 3,495.10 -0.35
టాటా కన్సూమర్‌ 651.05 -0.34 భారతీ ఎయిర్‌టెల్‌ 547.80 -0.34