For Money

Business News

నిఫ్టి: పడితే కొనుగోలు చేయండి

నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది. విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 2000 కోట్ల విలువైన షేర్లను నిన్న నికరంగా అమ్మాయి. అయినా నిఫ్టి భారీగా పెరిగింది. స్థానిక ఇన్వెస్టర్లు, దేశీయ ఆర్థిక సంస్థలు నిన్న భారీ ఎత్తున కొనుగోలు చేశారు. ఇవాళ అదే ట్రెండ్‌ కొనసాగుతుందా లేదా అన్న అనుమానం ఉన్నా… నిఫ్టి ఇవాళ 15,000పైన ప్రారంభం కానుంది. రిస్క్‌ తీసుకునే వారు మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది సేపటికి నిఫ్టి గనుక 15,060ని దాటే పక్షంలో 15120 స్టాప్‌లాస్‌తో అమ్మి, స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. కాని అనలిస్టులు మాత్రం నిఫ్టి పడినపుడు కొనుగోలు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. నిఫ్టికి 15,200 వరకు పెద్ద అవరోధం లేదని, కాబట్టి పడినపుడు కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు. నిఫ్టి 15,400ని కూడా క్రాస్‌ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని… ఇలాంటి సందర్భంగా బై సైడ్‌ ఉండటం బెటర్‌ అని సలహా ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకునేవారు, కాస్సేపట్లో స్వల్ప లాభాలు ఆశించే వారు అధికస్థాయిలో అమ్మి, వెంటనే కవర్‌ చేసుకోవచ్చని అంటున్నారు.
ఇక షేర్ల విషయానికి వస్తే లుపిన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హావెల్స్‌ బై లిస్ట్‌లో ఉన్నాయి. రూ. 640ని ఐసీసీఐసీ బ్యాంక్‌ దాటే అవకాశం ఉన్నందున రూ. 615 స్టాప్‌లాస్‌లో కొనుగోలు చేయొచ్చు. అయితే ఓపెనింగ్‌లోనే షేర్‌ లాభాలతో ఓపెనయ్యే అవకాశముంది. పడేంత వరకు ఆగి కొనుగోలు చేయడం మంచిదని అనలిస్టులు సలహా ఇస్తున్నారు.