For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ స్వల్ప నష్టాలతో క్లోజ్‌ కాగా ఇతర సూచీలు అరశాతంపైనే నష్టపోయాయి. డాలర్‌ బలహీనంగా ఉన్నా క్రూడ్‌ ధరల్లో ఒత్తిడి వచ్చింది. బులియన్‌లోనూ అదే ట్రెండ్‌ కన్పిస్తోంది. ఆసియా మార్కెట్లలో కొన్ని ప్రధాన మార్కెట్లకు సెలవు. చైనా నష్టాల్లో ఉంది. ఇటీవల భారీగా పెరిగిన జపాన్‌ మార్కెట్‌ ఇవాళ 1.5 శాతంపైగా నష్టంతో ఉంది. ఆస్ట్రేలియా మార్కెట్‌ కూడా అంతే. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.నిఫ్టి కూడా నష్టాల్లో ప్రారంభం కావొచ్చు. ఇవాళ టాటా మోటార్స్‌కు మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. అమెరికా మార్కెట్లలో ఈ షేర్‌ రాత్రి స్థిరంగా ముగిసింది.