For Money

Business News

నిఫ్టి ఇవాళ ఛాన్స్‌ ఇచ్చేనా?

నిఫ్టి ప్రధాన రెస్టిస్టెన్స్‌ వద్ద ట్రేడవుతోంది. 15030, 15200 స్థాయిల మధ్య నిఫ్టి ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. కరోనా డేటా వచ్చాక నిఫ్టిని గమనించండి. టెక్నికల్ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టిలో ఇవాళ పెద్ద కదలికలు లేకపోవచ్చు. డే ట్రేడర్స్‌ నిఫ్టిలో ట్రేడ్‌కు ఇవాళ దూరంగా ఉండటం బెటర్‌. ఎంపిక చేసిన షేర్లలో ట్రేడ్‌ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లపై దృష్టి సారించమని అంటున్నారు. మరికొందరు అనలిస్టులు నిఫ్టికి 15,030 ప్రాంతంలో మద్దతు అందవచ్చని, ఒకవేళ నిఫ్టి 15000 ప్రాంతానికి వస్తే 30 పాయింట్ల స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని, నిఫ్టి ఇవాళ గ్రీన్‌లో క్లోజ్‌ అవుతుందని భావిస్తున్నారు. రిస్క్‌ వొద్దనుకునేవారు నిఫ్టి ట్రేడ్‌కు దూరంగా ఉండటం బెటర్‌. లేదంటే దిగువ స్థాయిలో కొని, స్వల్ప లాభాలతో బయటపడటం మరో వ్యూహం.