For Money

Business News

నిఫ్టి నష్టాలతో ప్రారంభమైనా…

ఊహించినట్లే నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు లభిస్తోంది. కరోనా కేసులు మార్కెట్‌ను ఏమాత్రం ప్రభావితం చేయడం లేదు. అయితే ఫలితాలు మాత్రం షేర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఇవాళ నిఫ్టి 15,058 వద్ద ప్రారంభమైన నిఫ్టి 15045ని తాకింది. ప్రస్తుతం నిఫ్టి 31 పాయింట్ల నష్టంతో 15,077 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ షేర్ల సూచీ గ్రీన్‌లో ఉన్నా… నామ మాత్రపు లాభాలే. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందుతుందని, 14,960 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. రిస్క్‌ వొద్దనుకునేవారు స్వల్ప లాభాలతో ఇవాళ బయటపడొచ్చు. పొజిషనల్‌ ట్రేడర్లు 15200 వరకు వెయిట్‌ చేయొచ్చు. టాటా మోటార్స్‌ ఊహించినట్లే నాలుగు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్
యూపీఎల్‌ 790.50 2.74
పవర్‌ గ్రిడ్‌ 237.30 1.80
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,734.25 1.22
గ్రాసిం 1,408.55 1.16
ఎల్‌ అండ్‌ టీ 1,431.85 1.03

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 315.60 -5.07
ఎం అండ్‌ ఎం 783.00 -1.84
ఓఎన్‌జీసీ 114.55 -1.34
కొటక్‌ బ్యాంక్‌ 1,733.25 -1.24
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 964.10 -1.07