For Money

Business News

చైనా దెబ్బకు నిఫ్టి పతనం

నిన్న క్రిప్టో కరెన్సీకి సంబంధించి చైనా ఇచ్చిన వార్నింగ్‌తో బిట్‌కాయిన్‌తో సహా అనేక క్రిప్టో కరెన్సీలు 20 శాతంపైగా క్షీణించాయి. చైనా హెచ్చరిక ఎంత గట్టి దెబ్బ కొట్టిందంటే… బిట్‌ కాయిన్‌ మినహా మిగిలిన క్రిప్టో కరెన్సీలు ఇవాళ మరో 20 శాతం క్షీణించాయి. ఈ దెబ్బకు రాత్రి అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డీలా పడింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. దీనికి కారణంగా చైనా ఇచ్చిన మరో హెచ్చరిక. మనదేశంలో సిమెంట్‌, స్టీల్‌ వంటి ముడిపదార్థాల ధరలు పెరుగుతుంటే కళ్ళు మూసుకుంది ప్రభుత్వం. అయితే చైనా మాత్రం ఇవాళ చాలా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఖనిజాల ధరలను కృత్రిమంగా పెంచుతున్నారని… వీటిపై దర్యాప్తు చేస్తామని హెచ్చరించడంతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్స్‌ ధరలు దిగి వచ్చాయి. మనదేశంలో అన్ని ప్రధాన మెటల్‌ కంపెనీల షేర్లు పడ్డాయి. దీంతో ఉదయం నిఫ్టి క్షీణించినా 14,960 వద్ద మద్దతు లభించింది. అయితే మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు కూడా డల్‌గా ఉండటంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌తో పాటు మెటల్స్‌లో వచ్చిన ఒత్తిడితో నిఫ్టి 124 పాయింట్ల నష్టంతో 14,906 వద్ద క్లోజైంది. నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిని కోల్పోయింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. కాకపోతే మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తక్కువగా ఉంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
సిప్లా 925.50 2.38
ఎంఅండ్‌ఎం 803.00 2.32
బీపీసీఎల్‌ 455.80 2.09 ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 976.50 0.98 టైటాన్‌ 1,535.50 0.94

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా స్టీల్‌ 1,104.90 -5.10
హిందాల్కో 386.20 -4.24
కోల్‌ ఇండియా 146.65 -3.42
బ్రిటానియా 3,428.90 -2.98
ఓఎన్‌జీసీ 111.60 -2.87