For Money

Business News

HOT STOCKS: హావెల్స్, జీటీవీ

ఇవాళ మార్కెట్‌లో హావెల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జేకే టైర్స్‌ షేర్లు వెలుగులో ఉండే అవకాశముంది. గత రెండు రోజుల నుంచి హావెల్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లను అనలిస్టులు సిఫారసు చేసింది. హావెల్స్‌ నిన్న అద్భుత పనితీరు కనబర్చింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలె కంపెనీ అమ్మకాలు 50 శాతం పెరిగి రూ. 3,339 కోట్లకు చేరగా, నికర లాభం 71 శాతం పెరిగి రూ. 303 కోట్లకు చేరింది. దీంతో షేర్‌లో మరింత అప్‌ట్రెండ్‌కు అవకాశముందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వరుసగా నష్టాలు ప్రకటిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాన్ని ప్రకటించింది. అయితే ఆదాయంలో మాత్రం పెద్దగా మార్పలు లేదు. రూ. 1,965 కోట్ల ఆదాయంపై కంపెనీ రూ. 275 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. మంచి ఫలితాలు ప్రకటించడంతో జేకే టైర్స్‌ నిన్న ఆరు శాతం లాభపడింది. నిన్న మార్కెట్‌ నష్టాల్లో ఉన్న ఈ షేర్‌ లాభంతో ముగిసింది. ఇవాళ ఈ మూడు షేర్లు పాజిటివ్‌లో ఉండొచ్చు. ముఖ్యంగా హావెల్స్‌లో లాభాల స్వీకరణ కన్పిస్తుందా లేదా ఇంకా పెరుగుతుందా అనేది చూడాలి.