For Money

Business News

దివాలా కంపెనీల పారిశ్రమికవేత్తలకు షాక్‌

సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దివాలా తీసిన కంపెనీల తరఫున గ్యారంటీ ఇచ్చిన ప్రమోటర్లను కూడా ప్రాసిక్యూట్‌ చేసేందుకు సుప్రీం కోర్టు ఇవాళ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు కంపెనీల రుణాలకు తమకు సంబంధం లేదని ప్రమోటర్లు వాదిస్తూ వచ్చారు. దీంతో ఇక నుంచి దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన రుణాలు రాబట్టుకునేందుకు బ్యాంకులు ఆయా కంపెనీల ప్రమోటర్లపై కూడా కేసులు పెట్టే అవకాశముంది. వాస్తవానికి కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సి రెజల్యూషన్‌ ప్రాసెస్‌ (CIRP) ఎదుర్కొంటున్న కంపెనీలపై ఇన్‌సాల్వెన్సి అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (IBC) నిబంధనల కింద కేసులు పెట్టే విధానం ఇపుడు అమల్లో ఉంది.ఈ నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ దివాలా తీస్తే… ఆ కంపెనీ తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చిన ప్రమోటర్లపై కూడా బ్యాంకులు చర్యలు తీసుకోవచ్చు. దీన్ని సవాలు చేస్తూ, కంపెనీల లావాదేవీలకు తమకు ఎలాంటి సంబంధం లేదని కొందరు ప్రమోటర్లు పిటీషన్‌ వేశారు. అయితే ఈ పిటీషన్‌ను ఇవాళ కోర్టు కొట్టివేసింది.