For Money

Business News

హైదరాబాద్‌లో ‘రియల్‌’ కళకళ

ప్రస్తుత సంవత్సరం జనవరి – మార్చిలో హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు 39 % పెరిగాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో టాప్‌లో ఉందని ప్రముఖ ఆన్‌లైన్‌ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ వెల్లడించింది. ఈ సంస్థ తన తాజా నివేదిక ‘రియల్ ఇన్ సైట్ క్యూ1- 2021’లో దేశంలోని వివిధ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ పరిస్థితిని వివరించింది, గతంతో పోల్చితే ఈ ఏడాది జనవరి – మార్చిలో హైదరాబాద్‌ ఇళ్ళ అమ్మకాలు 39 శాతం పెరిగినట్లు తేలింది. గత ఏడాది జనవరి – మార్చి మధ్యకాలంలో 5,554 గృహాల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది అదే కాలంలో 7 , 721 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నది . వీటి విలువ రూ .8,400 కోట్లని, గతేడాదితో చూస్తే 34 శాతం ఎక్కువని పేర్కొంది. ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇతర ఏ ప్రధాన నగరాల్లో అమ్మ కాలు లేవని స్పష్టం చేసింది .

కొండాపూర్, కొంపల్లి, కూకట్‌పల్లి, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, సంగారెడ్డిలో గృహాల మంచి డిమాండ్ కనిపిస్తోందని ప్రాప్ టైగర్ తెలిపింది. కూకట్‌పల్లి, నిజాంపేట్‌లలో రూ .50 లక్షలలోపు ఇండ్లకు గిరాకీ ఉంటే .. కొండాపూర్, మియాపూర్, కొంపల్లిల్లో రూ.50 లక్షలు – కోటి రూపాయల మధ్య డిమాండ్ ఉంటోంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణాలు 48 శాతం పెరిగినట్లు ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది. ఇక త్రిబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళకు కూడా డిమాండ్‌ బాగానే ఉందని పేర్కొంది