For Money

Business News

నిఫ్టి అప్‌ట్రెండ్‌ కొనసాగేనా?

నిఫ్టి మళ్ళీ 15000పైన ప్రారంభమైంది. నిన్న చివరి ఒక గంటలో డెరివేటివ్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టి క్షీణించింది. ఇవాళ మళ్ళీ ఆ లాభాలను తిరిగి సాధించింది.నిఫ్టి ప్రస్తుతం 105 పాయింట్ల లాభంతో 15,011 వద్ద ట్రేడవుతోంది. మొన్న నుంచి క్షీణిస్తూ వస్తున్న మెటల్స్‌, సిమెంట్‌ ఇవాళ కోలుకున్నాయి. ఫలితాలు బాగున్న కంపెనీలన్నీ లాభాల్లో ఉన్నాయి. హావెల్స్‌లో లాభాల స్వీకరణ సాగుతోంది. ఇవాళ ఫలితాలు ప్రకటించనున్న ఎస్‌బీఐ ఇప్పటికే పది శాతం పెరిగింది. ఇవాళ కూడా రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్లు కూడా ఇదే స్థాయిలో లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఇక్కడి నుంచి 15,060 వద్దకు చేరుతుందా అన్నది చూడాలి. నిఫ్టికి ప్రధాన ప్రతిఘటన ఇక్కడే ప్రారంభం కానుంది. ఈ స్థాయిని దాటినా వెంటనే 15100పైన ఎదురు కానుంది. ఈ స్థాయిలో ఒకట్రెండు రోజులు నిలదొక్కుకున్నాకే నిఫ్టి ముందుకు సాగవచ్చు. అప్పటి వరకు నిఫ్టి 15,000 ప్రాంతంలో ఒత్తిడి ఖాయం. కాబట్టి స్వల్ప లాభాలతో అటు, ఇటు ట్రేడ్‌ చేయడం మంచిది. నిఫ్టిలో 46 షేర్లు గ్రీన్‌లో ఉన్నా…నిఫ్టి ముందుకు సాగడం కష్టంగా ఉంది.

నిఫ్టి టాప్ గెయినర్స్‌
బీపీసీఎల్‌ 466.90 2.66 ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 993.10 1.80
ఎస్‌బీఐ 389.85 1.38
ఐఓసీ 106.05 1.29
ఐసీఐసీఐ బ్యాంక్‌ 626.25 1.24

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
పవర్‌గ్రిడ్‌ 226.85 -0.92
ఎస్‌బీఐ లైఫ్‌ 967.45 -0.18
హీరో మోటోకార్ప్‌ 2,860.90 -0.15