For Money

Business News

BUY &SELL: సిప్లా, అరబిందో

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి నాస్‌డాక్‌ భారీ లాభాలతో ముగిసింది. అయితే మన మార్కెట్‌లో ఇవాళ ఫార్మా బాగా రాణించవచ్చని అనలిస్టలు భావిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ మితేస్‌ టక్కర్‌ ఇవాళ సిప్లా, అరబిందో ఫార్మా షేర్ల కొనుగోలుకు సిఫారసు చేశారు. సీఎన్‌బీటీ టీవీ18 ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ అరబింద్‌ ఫార్మా షేర్‌ను రూ. 1055 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. స్టాప్‌లాస్‌ రూ. 1010. అలాగే సిప్లా షేర్‌ను రూ. 950 టార్గెట్‌ కోసం మితేస్‌ టక్కర్‌ సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్ స్టాప్‌లాస్‌ రూ. 912. ఇక చోళ మండలం షేర్‌ను రూ. 587 టార్గెట్‌తో రూ. 562 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన సిఫారసు చేశారు. గుజరాత్ గ్యాస్‌ను రూ. 518 స్టాప్‌లాస్‌తో రూ. 492 టార్గెట్‌ కోసం అమ్మాలని ఆయన సిఫారసు చేశారు.