For Money

Business News

దమ్ముంటే అమ్మండి

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 18191. ఇవాళ 60 పాయింట్ల లాభంతో ప్రారంభం కావొచ్చు. ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుందో చూడండి. ఇప్పటికే పొజిషన్స్‌ తీసుకున్నవారు ఇవాళ అధిక స్థాయిలో అమ్మేసి… లాభాలు స్వీకరించండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిఫ్టిని ఇవాళ కొనుగోలు చేయొద్దని సీఎన్‌బీఐ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిరట్‌ అనూజ్‌ సలహా ఇస్తున్నారు. పుట్‌ కాల్ రేషియో ఇప్పటికే 1.4 శాతం దాటిందని… మార్కెట్‌ ప్రారంభమయ్యాక ఇంకా పెరుగుతుందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిఫ్టి కొనుగోలు చేయొద్దని… ఉన్న పొజిషన్స్‌ను అమ్మేసి.. వచ్చే వారం కోసం వెయిట్‌ చేయమని ఆయన సలహా ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి అధిక స్థాయిలో అమ్మొచ్చని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి గనుక 18273 (20 DEMA) పైకి వెళితే అమ్మడానికి ఛాన్స్‌ అని ఆయన అన్నారు. వాస్తవానికి నిఫ్టి 20 DMAఇపుడు 18378 వద్ద ఉందని… ఈ ప్రాంతానికి వెళ్ళే కొద్దీ అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంటుందని అనూజ్‌ అంటున్నారు. 20 లేదా 30 పాయింట్ల స్టాప్‌లాస్‌తో అధిక స్థాయిలో నిఫ్టిని అమ్మితే మంచి లాభాలు వచ్చే అవకాశముందని ఆయన అంటున్నారు. నిఫ్టిని మాత్రం ఏ స్థాయిలోనూ కొనుగోలు చేయొద్దన్నారు. ఏదైనా కారణం వల్ల నిఫ్టి పెరిగినా పట్టించుకోవద్దన్నారు. డెరివేటివ్స్‌ మార్కెట్‌ చూస్తే నిన్న నిఫ్టి బ్యాంక్‌లో 86 శాతం, నిఫ్టిలో 79 శాతం రోల్‌ ఓవర్ ఉంది.