For Money

Business News

18250పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైనా… క్షణాల్లోనే అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఓపెనింగ్‌లో 18264 తాకిన నిఫ్టి ఆ వెంటనే 18210కి క్షీణిచింది. ప్రస్తుతం 18224 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 34 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో ఉన్నా… అన్నీ నామమాత్రమే. నిఫ్టి బ్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. అయితే నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు అర శాతంపైగా లాభంతో ఉంది. నిఫ్టిలో టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు ఒక శాతం లాభంతో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న షేర్లలో కూడా పెద్ద ఒత్తిడి లేదు. నిఫ్టి నెక్ట్స్‌లో కూడా పేటీఎం 2.5 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా ఉంది. ఇక నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, పర్సిస్టెంట్స్‌ రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. కొత్త సిరీస్‌ జనవరి ఇవాళ ప్రారంభం కాగా, ఈ క్యాలెండర్‌ ఇయర్‌ ఇదే చివరి ట్రేడింగ్‌ సెషన్‌.