For Money

Business News

ఎలిన్‌ : లిస్టింగ్‌ నష్టాలు

కెఫిన్‌ తరవాత ఇవాళ ఎలిన్‌ ఎలక్ట్రానిక్స్‌ కూడా నష్టాలతో లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 247లకు ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేసింది. ఇవాళ రూ. 244 వద్ద ఓపెన్‌ అయిన ఈ షేర్‌ రూ. 238లకు తాకింది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగంలో ప్రధాన ప్లేయర్‌గా ఉన్న ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ 22న ముగిసిన విషయం తెలిసింది. ఎలిన్ ఎలక్ట్రానిక్స్ భారత్ లో లీడింగ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉంది. ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి దాదాపు అన్ని మేజర్ బ్రాండ్స్ కు అతి పెద్ద సప్లయర్‌గా ఈ ఎలిన్ క్ట్రానిక్స్ ఉంది. లైట్స్,ఫ్యాన్స్, కిచెన్ అప్లయన్సెస్ లో ఈ సంస్థ కీలక ప్లేయర్ గా ఉంది. ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 475 కోట్లను ఎలిన్‌ సమీకరించింది. ఇష్యూ సమయంలో రూ.45 ప్రీమియంతో ఉన్న ఈ షేర్‌ లిస్టింగ్‌ సమయంలో 3 శాతం నష్టంతో లిస్టయింది. దీర్ఘకాలానికి ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని…తొందర పడి కొనాల్సిన అవసరం లేదని అనలిస్టులు అంటున్నారు.