For Money

Business News

లాభాల్లో సింగపూర్‌ నిఫ్టి

హమ్మయ్య… రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెక్‌, ఐటీ షేర్లకు దిగువ స్థాయిలో మద్దతు అందింది. నాస్‌డాక్‌ చాలా రోజుల తరవాత 2.59 శాతం లాభంతో ముగిసింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.75 శాతం మేర లాభపడింది. డౌజోన్స్ కూడా 1.05 శాతం లాభపడటం విశేషం. అనేక షేర్లు 52 వారాల గరిష్ఠానికి రావడంతో ఇన్వెస్టర్లలో స్వల్ప ఆసక్తి కన్పిస్తోంది. కొత్త ఏడాది సంవత్సరం నేపథ్యంలో మార్కెట్లలో టర్నోవర్‌ బాగా తగ్గింది. రాత్రి డాలర్‌ స్వల్పంగా తగ్గింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 104 దిగువకు వెళ్ళింది. ఇక క్రూడ్‌ ఆయిల్‌ స్థిరంగా ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 84 డాలర్ల ప్రాంతంలో ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. మెజారిటీ సూచీలు అర శాతంపైన ట్రేడవడం విశేషం. జపాన్‌ నిక్కీ మాత్రం 0.2 శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 61 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. కొత్త సిరీస్‌ అంట్‌ జనవరి డెరివేటివ్స్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానున్నాయి.