For Money

Business News

డాలర్‌ డౌన్‌…భారీ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఇన్నాళ్లు పడిన మార్కెట్‌ ఇపుడు అదే కారణాలతో పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకింగ్‌ రంగానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని భారీ ఎత్తున బ్యాంకు షేర్లను కొంటున్నారు ఇన్వెస్టర్లు.అలాగే ఆయిల్‌ రేట్లు కూడా ఇప్పట్లో తగ్గవని వార్తలు వస్తుండటంతో… ఆరంగానికి చెందిన షేర్లకు డిమాండ్‌ వస్తోంది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో డౌజోన్స్‌ 1.57 శాతం, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 1.26 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ కూడా 0.7 శాతం లాభంతో ఉంది. యూరప్‌ మార్కెట్లన్నీ స్వల్ప లాభాల నుంచి మరింత బలపడ్డాయి. అమెరికా మార్కెట్ల ప్రారంభం తరవాత యూరో మార్కెట్లు కూడా ఒక శాతంపైగా లాభపడ్డాయి. డాలర్ ఇవాళ బలహీనపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 0.35 శాతం తగ్గి 91.99 వద్ద ట్రేడవుతోంది. దీంతో బులియన్‌ గ్రీన్‌లోకి వచ్చింది. లాభాలు నామమాత్రంగానే ఉన్నాయి. అయితే క్రూడ్‌ మాత్రం దూసుకుపోతోంది. చూస్తుంటే ఇవాళ లేదా రేపు బ్రెంట్‌ క్రూడ్‌ 75 డాలర్లను దాటడం ఖాయంగా కన్పిస్తోంది.