For Money

Business News

15,800పైన ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. డౌజోన్స్‌ ఏకంగా 1.76 శాతం లాభపడింది. ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ 0.79 శాతంతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా ఒక శాతం వరకు లాభపడ్డాయి. నిన్న భారీగా పడిన సూచీలు ఇవాళ ఆకర్షణీయ లాభాలు పొందగా, నిన్న స్థిరంగా ఉన్న మార్కెట్లు ఇవాళ కూడా నిలకడగా ఉన్నాయి. నిన్న రెండు శాతంపైగా తగ్గిన జపాన్‌ నిక్కీ ఇవాళ మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది.చైనా స్థిరంగా ఉంది. అలాగే హాంగ్‌సెంగ్‌ కూడా. దాదాపు అన్ని మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ మాత్రం స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 80 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా దాదాపు ఇదే స్థాయిలో లాభాలతో అంటే 15,000పైన ప్రారంభం కానుంది.