For Money

Business News

NIFTY TRADE: పడే వరకు ఆగండి

నిన్న భారీగా పెరిగిన నిఫ్టి ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. నిన్న భారీగా పెరిగిన సూచీలు ఇవాళ డల్‌గా ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా డల్‌గా ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రకారం చూస్తే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,800పైన ప్రారంభం కానుంది. ఇక్కడి నుంచి నిఫ్టికి తొలి ప్రతిఘటన 15840, తరవాత 15,860 వద్ద ఎదురు కానుంది. ఈ రెండు స్థాయిలను స్టాప్‌లాస్‌గా పెట్టుకుని నిఫ్టిని అమ్మొచ్చు. కాని నిఫ్టి నిన్నటి గరిష్ఠ స్థాయి 15,765 వద్ద ఆగుతుందేమో చూడండి. ఎందుకంటే ఇవాళ్టి ట్రేడింగ్‌కు అదే కీలక స్థానం. ఒకవేళ నిఫ్టి గనుక 15,650 ప్రాంతంలోకి అంటే నిన్నటి క్లోజింగ్‌కు స్థాయికి వస్తే కొనుగోలు చేయొచ్చు. స్టాప్‌లాస్‌ 15,635.నిఫ్టి రెండువైపులా ట్రేడ్‌కు ఛాన్స్‌ ఉంది.15,660-15,830 రేంజ్‌ మధ్య నిఫ్టి కదలాడవచ్చు. డాలర్‌ పెరుగుతున్నందున మెటల్స్ ఎలా రియాక్టవుతాయో చూడాలి.