For Money

Business News

లాభాలతో ముగిసిన నిఫ్టి

కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 240 పాయింట్లు కోలుకుంది. అమెరికా, ఆసియా మార్కెట్లకు అనుగుణంగా భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి…క్రమంగా కోలుకుంటూ మిడ్‌ సెషన్‌లో లాభాల్లో వచ్చింది. యూరో మార్కెట్లకు అనుగుణంగా లాభాల్లో ముగిసింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 63 పాయింట్ల లాభంతో 15,746 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం భారీగా నష్టపోయిన దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ సూచీ 0.85 శాతం లాభపడింది. అదానీ పవర్‌ ఇవాళ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.ఈనెల 17వ తేదీన ఈ కౌంటర్‌లో ప్రమోటర్లే రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.యూపీఎల్‌ ఇవాళ ఏకంగా నాలుగు శాతం నష్టపోయింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 730.00 5.13
ఎన్‌టీపీసీ 118.05 3.96
టైటాన్‌ 1,742.00 1.79
ఎస్‌బీఐ 419.10 1.50
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 12,161.15 1.35

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
యూపీఎల్‌ 772.60 -4.38
విప్రో 543.40 -1.16
టాటా మోటార్స్‌ 334.00 -1.01
మారుతీ 6,890.10 -1.00
టెక్‌ మహీంద్రా 1,061.80 -0.83