For Money

Business News

MID SESSION: లాభాల్లోకి నిఫ్టి

ఉదయం నుంచి క్రమంగా కోలుకుంటూ మిడ్‌ సెషన్‌కల్లా నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. ఉదయం 15,505 కనిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టికి ఆల్గో ట్రేడింగ్‌ మొదటి మద్దతు స్థాయి 15,582 వద్ద మద్దతు లభించింది. అక్కడి నుంచి మరో మద్దతు స్థాయి 15,632 స్థాయిని కూడా దాటింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం భారీ నష్టాలతో ముగిసినందున… ఇవాళ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. భారత మార్కెట్లు కూడా గ్రీన్‌లోకి వచ్చాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా స్వల్ప లాభంలోకి వచ్చాయి. మరి యూరో, అమెరికా మార్కెట్ల మాదిరిగా స్వల్ప లాభంతో క్లోజవుతాయా? లేదా ఇతర ఆసియా మార్కెట్ల మాదిరి నష్టాల్లో ముగిస్తాయా అన్నది చూడాలి. 15,640పైన వెంటనే నిఫ్టికి పెద్ద ప్రతి ఘటన లేదు కాని… ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టి నిలబడుతుందా అన్నది అనుమానమే. చిన్న ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో బయటపడటం మంచిదని టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఈ స్థాయిలో అమ్మేవారు 15700 కచ్చితం స్టాప్‌లాస్‌ పెట్టుకుని అమ్మకాలని అంటున్నారు. లేకుంటే ఇవాళ్టి ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే నిఫ్టికి తదుపరి 15,785 దాకా పెద్ద ప్రతిఘటన లేదు. ఈ స్థాయిలో కొనుగోలు చేయడంకన్నా.. లాభాలు స్వీకరించడం మేలని టెక్నికల్‌ అనలిస్టలు సలహా ఇస్తున్నారు.