For Money

Business News

15,500 వద్ద అందిన మద్దతు కాని…

ఊహించినట్లే నిఫ్టి ఒక శాతంపైగా నష్టంతో 15,525 వద్ద ప్రారంభమైంది. 15,505 వద్ద నిఫ్టికి మద్దతు అందింది. ఉదయం పేర్కొన్నట్లు నిఫ్టికి 15,500 వద్ద మద్దతు అందింది. ఈ స్థాయిలో కొన్న డే ట్రేడర్స్‌ మంచి లాభాలు అందాయి. నిఫ్టి ఇపుడు 15,575 వద్ద ట్రేడవుతోంది. ఆల్గో ట్రేడింగ్‌ ఫాలో అయ్యేవారికి ఇది ప్రధాన ప్రతిఘటన. దీని తరవాత నిఫ్టికి 15,630 రెండో ప్రధాన ప్రతిఘటన. ఈ స్థాయిలో నిఫ్టి పుట్‌ కొనుగోలు చేయమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే మిడ్‌ సెషన్లో యూరో మార్కెట్లు ప్రారంభమయ్యేలోగా నిఫ్టి కరెక్షన్‌ వచ్చే అవకాశముంది. నిఫ్టికి 15,500 కీలక స్థాయి. దీని దిగువకు వస్తే నిఫ్టి 15,250-15,300కిచేరే అవకాశముంది. నిఫ్టితోపాటు మిడ్‌ క్యాప్‌, బ్యాంక్‌ నిఫ్టి, మెటల్స్‌లో కూడా భారీ ఒత్తిడి వస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 116.25 2.38
అదానీ పోర్ట్స్‌ 710.60 2.34
హిందుస్థాన్‌ లీవర్‌ 2,510.80 1.12
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 716.00 0.96
ఓఎన్‌జీసీ 121.35 0.91

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హిందాల్కో 362.70 -2.33
టాటా మోటార్స్‌ 329.60 -2.31
యూపీఎల్‌ 790.05 -2.22
ఎం అండ్‌ ఎం 766.45 -1.93
ఐసీఐసీఐ బ్యాంక్‌ 618.45 -1.90