For Money

Business News

కీలకస్థాయిలో నిఫ్టికి మద్దతు

ఉదయం ట్రేడింగ్‌ చేసేవారికి నిఫ్టికి 15,675 అత్యంత కీలక స్థాయి అని… ఇక్కడ మద్దతు అందితే నిఫ్టి కోలుకుందని టెక్నికల్‌ అనలిస్టులు చేసిన సిఫారసును ప్రస్తావించాం. నిఫ్టి సరిగ్గా 15,678ని టచ్‌ చేసిన తరవాత ఇంట్రా డే తొలి ప్రతిఘటన స్థాయి 15,750ని దాటింది. ఉదయం అనుకున్నట్లు మిడ్‌ సెషన్‌లో 17,750 లోపల నిఫ్టికి ఒత్తిడి వచ్చినా 15,700 వద్దే ఈసారి కోలుకుంది. మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి 15,773ని తాకి 15,751 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 81 పాయింట్లు లాభపడింది. నిన్నటి నుంచి అనుకుంటున్నట్లు పొజిషనల్ ట్రేడర్స్‌కు నిఫ్టి బాగా కలిసి వస్తోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే పొజిషనల్‌ ట్రేడర్స్‌ టార్గెట్‌ 16,000కు నిఫ్టి చేరుతుందేమో చూడాలి. ఇవాళ అధిక భాగం ట్రేడింగ్‌ లార్జ్‌ క్యాప్స్‌కే పరిమితం కావడంతో మిడ్‌ క్యాప్‌ సూచీలో పెద్ద మార్పు లేదు. బ్యాంక్‌ నిఫ్టి కూడా అంతంతే.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
అదానీ పోర్ట్స్‌ 877.90 5.28
పవర్‌గ్రిడ్‌ 237.45 5.00
ఎన్‌టీపీసీ 116.45 4.21
టాటా మోటార్స్‌ 344.35 2.81
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6,836.00 2.58

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
బజాజ్‌ ఫైనాన్స్‌ 5,726.00 -4.46
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 11,798.05 -2.94
హెచ్‌డీఎఫ్‌సీ 2,586.80 -1.23
దివీస్‌ ల్యాబ్‌ 4,227.00 -0.81
సిప్లా 939.00 -0.78