For Money

Business News

అమెరికా ఫెడ్‌ కీలక ప్రకటన

చాలా ఉత్సాహకర ఆర్థిక గణాంకాల నేపథ్యంలో భవిష్యత్‌ ఆర్థిక పరిస్థితి గురించి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ నుంచి పాజిటివ్‌ సంకేతాలు వస్తాయని భావించినవారికి నిరాశ మిగిలింది. నెలకు 12,000 కోట్ల ఉద్దీపన కార్యక్రమం కొనసాగుతుందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థకు ఉన్న రిస్క్‌ ఇంకా కొనసాగుతుందని చెబుతూ… వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు జీరో. అమెరికా ఫెడ్‌ నిర్ణయం తరవాత అమెరికా డాలర్‌ పెరిగింది. ఫెడ్‌ నిరాశాజనక కామెంట్లతో పాటు డాలర్‌ పెరగడంతో క్రూడ్‌ భారీగా క్షీణించింది. అయినా బ్రెంట్‌ క్రూడ్‌ 73-74 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. అయితే వడ్డీ రేట్లను 2023 ముందే రెండు సార్లు పెంచుతామని చెప్పడంతో డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఒత్తిడి పెరుగుతోంది.