For Money

Business News

మద్దతు స్థాయి వద్ద నిఫ్టి ప్రారంభం

ఊహించినట్లు నిఫ్టి నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే తన తొలి మద్దతు స్థాయి 15,815ని తాకింది.ప్రస్తుతం 36 పాయింట్ల నష్టంతో 15,833 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టితో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్‌ షేర్లలో వరుసగా మూడోరోజు కూడా ఆ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టిలో 25 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి గనుక మళ్ళీ 15,800 దిగువకు వస్తే వెయిట్‌ చేయండి. ఈ ప్రాంతంలో 15 పాయింట్ల స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ నిఫ్టి గనుక 15,861 పైకి చేరితే కాస్తసేపు వెయిట్‌ చేయండి. నిఫ్టి 15,900 వద్ద అమ్మడానికి ఛాన్స్‌గా భావించవచ్చు. స్టాప్‌లాస్‌ 15,920. ఈ స్థాయిపైన అమ్మొద్దు. అధిక స్థాయిలో అమ్మే ఛాన్స్‌ వస్తే అమ్మడం బెటర్‌. దిగువస్థాయిలో కొనుగోలు ఛాన్స్‌ కోసం వెయిట్‌ చేయండి. లేదా రేపటి దాకా వెయిట్‌ చేయండి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 126.85 1.20
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ 11,862.95 0.54
ఎం అండ్‌ ఎం 812.60 0.49
టాటా కన్జూమర్‌ 722.00 0.35
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 694.95 0.35

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
అదానీ పోర్ట్స్‌ 741.30 -2.70
హిందాల్కో 386.35 -1.15
డాక్టర్‌ రెడ్డీస్‌ 5,353.30 -1.06
రిలయన్స్‌ 2,230.35 -0.87
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 1,026.00 -0.82