ఎన్సీఎల్ లాభంలో 262 శాతం వృద్ధి
మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ రూ.29 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.7.65 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది లాభం 262 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.249 కోట్ల నుంచి రూ.410 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూపాయి (10శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం ఏడాదికి రూ.1,391 కోట్ల ఆదాయంపై రూ.145 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
