For Money

Business News

జొమాటొ నుంచి ఎన్‌బీఎఫ్‌సీ

రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది.
అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని(ఎన్‌బీఎఫ్‌సీ) ఏర్పాటు చేయనుంది. రూ. 10 కోట్లతో క్యాపిటల్‌తో ఈ సంస్థను ఏర్పాటు చేయనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్‌క్రెడ్‌తో జొమాటో 2020 లోనే ఓ ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా… ముందస్తుగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు మాత్రం రుణాలు పొందే వెసులుబాటు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం జొమాటో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే రుణాలనందజేసే అవకాశముంది. అలాగే హైదరాబాద్‌కు చెందిన యాడ్‌ఆన్‌మో అనే స్టార్టప్‌లో జొమాటో వాటాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అర్భన్‌ పైపర్‌ కంపెనీలో కూడా 5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే షిస్‌రాకెట్‌, సామ్‌సెట్‌ టెక్నాలజీస్‌, క్యూర్‌ ఫిట్‌ వంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది.