For Money

Business News

నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్లకు జనం ఆసక్తి

బహుశా భారత దేశంలో తొలిసారి నష్టాల్లో ఉన్న ఓ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. ఇది అమెరికాతో పాటు ఇతర మార్కెట్లలో సాధారణమైనా.. మనదేశంలో తొలిసారిగా జొమాటొ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. నష్టాల్లోఉన్న ఈ కంపెనీ షేర్లపై జనంలో విపరీతమైన ఆసక్తి వ్యక్తం అవుతుండటంతో కంపెనీ ఇష్యూ పరిమాణాన్ని పెంచుతోంది. ఈనెల 14వ తేదీన క్యాపిటల్‌ మార్కెట్‌లోకి రావాలని జొమాటో యోచిస్తోంది. మార్కెట్‌ నుంచి రూ. 7500 కోట్లు సమీకరించాలని భావించిన జొమాటో…జనం నుంచి మంచి డిమాండ్‌ వస్తుండటంతో రూ. 9,375 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఈ ఇష్యూకు సెబీ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూ ధర ఇంకా ఖరారు చేయలేదు. అయితే షేర్‌ధర రూ. 70 లేదా రూ. 72లు ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. కాని అనధికార మార్కెట్‌లో ఈ షేర్‌ ధర రూ. 85 నుంచి రూ. 90 పలుకుతోంది.