For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

నిన్న యూరో మార్కెట్ల జోష్‌తో పెరిగిన నిఫ్టి ఇవాళ ఆసియా మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా నష్టాల్లో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్‌లో ఎలాంటి మార్పు లేదు, మిగిలిన సూచీలు 0.3 శాతం లాభంతో ముగిశాయి. ఉద్దీపన ప్యాకేజీ కొనసాగుతుందని ఫెడ్‌ మినిట్స్‌లో వెల్లడైనా ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం జపాన్‌ నిక్కీ 0.68 శాతం, హాంగ్‌సెంగ్‌ ఏకంగా 1.638 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక చైనా మార్కెట్లు కూడా అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా నష్టంతో ప్రారంభం కానుంది. వరుసగా ఐపీఓలు రానున్న నేపథ్యంలో మార్కెట్‌ నిఫ్టి ఎలా ఉంటుందనేది ‘నిఫ్టి ట్రేడ్‌’ లో చదవగలరు.