For Money

Business News

ఫలితాలు ఓకే… మెరుపులు ఉంటాయా?

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.10,342కోట్ల నికర లాభంతో పాటు, 18,444కోట్ల నికర వడ్డీ ఆదాయం (అనగా రుణాపై వసూలు చేసిన వడ్డీ నుంచి డిపాజిట్లపై చెల్లించిన వడ్డీ తీయగా వచ్చిన లాభం) ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే నికర లాభం 18 శాతం పెరగ్గా, నికర వడ్డీ ఆదాయం 13 శాతం పెరిగింది. వడ్డీ వ్యాపారం కాకుండా ఫీజులు, కమీషన్ల రూపేణా కస్టమర్ల నుంచి కేవలం మూడు నెలల్లో రూ.5075 కోట్లను వసూలు చేసింది.

రుణాల మంజూరులో బ్యాంక్‌ 16.4 శాతం వృద్ధి సాధించి రూ.12.6 లక్షల కోట్లకు చేరింది. రీటైల్‌ రుణాల వాటా 13.5 శాతం. ఇక డిపాజిట్లు 13.8 శాతం వృద్ధి చెంది రూ. 14.46 లక్ష లకోట్లకు చేరాయి. మొత్తంమ్మీద బ్యాంక్‌ పనితీరు మార్కెట్‌ అంచనాల మేరకు ఉంది. మరి సోమవారం షేర్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 17,684 కోట్ల నికర వడ్డీ ఆదాయం, రూ.7513 కోట్ల నికర లాభం ఆర్జించింది. వడ్డీ ఆదాయం రూ. 700 కోట్లు, నికర లాభం రూ. 1500 కోట్లు పెరిగింది. గత ఏడాది నుంచి ఈ కౌంటర్‌లో పెద్ద కలికలు లేవు. పైగా అమెరికాలో బ్యాంకుల పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో ఆ కౌంటర్లలో శుక్రవారం అమ్మకాల జోరు అధికంగా ఉంది. మరి మన మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.