వాట్సప్‌పై రూ.2000 కోట్ల ఫైన్
తన వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్‌తో షేర్ చేసినందుకు వాట్సప్‌పై దాదాపు రూ.2000 కోట్ల (26.6 కోట్ల డాలర్ల) ఫైన్ వేసింది ఐర్లండ్. పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను వాట్సప్ ఉల్లంఘించిందని ఐర్లండ్‌కు చెందిన డేటా ప్రైవసీ కమిషనర్ (డీపీసీ) ఉత్తర్వులు జారీ చేశారు. డీపీసీ నిర్ణయంపై తాము అప్పీల్‌కు వెళతామని వాట్సప్ పేర్కొంది. యూరోపియన్ యూనియన్‌లో ఫేస్‌బుక్‌కు సంబంధించి లీడ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్‌గా ఐర్లండ్‌కు చెందిన డీపీసీ వ్యవహరిస్తున్నారు. ఈకేసు 2018కి సంబంధించినదని, పారదర్శకతకు సంబంధించి అప్పటి ఈయూ నిబంధనలను వాట్సప్ పాటించిందా లేదా అన్న అంశాన్ని డీపీసీ పరిశీలించారు. వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్ మధ్య డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించినట్లు డీపీసీ పేర్కొంది.