For Money

Business News

డిఫెండర్‌ 007 బాండ్‌ ఎడిషన్‌

జేమ్స్‌ బాండ్‌ 25వ సినిమా ‘నో టైమ్‌ టు డై’ విడుదల సందర్భంగా కొత్త లాండ్‌ రోవర్‌ లిమిడెట్‌ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నారు. డిఫెండర్‌ 007 రేర్‌ బ్యాడ్జ్‌తో అనేక స్పెషల్‌ ఫ్యూచర్స్‌తో వస్తున్న లాండ్‌ రోవర్‌ …కేవలం ఎంపిక చేసిన 300 మందికి మాత్రమే అమ్ముతున్నారు. వీల్స్‌ దగ్గర నుంచి కారు లోపల అనేక కొత్త ఫ్యూచర్స్‌…. దీనికి మాత్రమే పరిమితం. జేమ్స్‌ బాండ్‌ సినిమాలో ఉపయోగించిన ఈ మోడల్‌… రోడ్డుపై పరుగులు తీయడంలో తన స్టయిలే వేరు అని అంటోంది. కేవలం 5.4 సెకన్లలో 100 కి.మీ. స్పీడు అందుకోగల ఈ ల్యాండ్‌ రోవర్‌ టాప్‌ స్పీడు గంటకు 240 కి.మీ. రేంజ్‌ రోవర్‌ క్లాసిక్‌, ల్యాండ్‌ రోవర్‌ సిరీస్‌ IIIని కూడా జేమ్స్‌ బాండ్ మూవీలో ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది.