For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మీ వల్లే పెరిగాయి

ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ వ్యాట్‌ గురించి ప్రస్తావించారు. వ్యాట్‌ తగ్గించని రాష్ట్రాలంటూ తెలంగాణ రాష్ట్రం పేరు కూడా ప్రస్తావించారు. దీనిపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఇలా ప్రత్యేకంగా ఒక రాష్ట్రం పేరు చెప్తారా? ఏ కో ఆపరేటివ్‌ ఫెడరలిజం గురించి మీరు మాట్లాడేది అని ప్రధానిని నిలదీశారు. వ్యాట్‌ తగ్గించమని తమ రాష్ట్రం పేరు ఎందుకు ప్రస్తావిస్తారని… తాము వ్యాట్‌ పెంచలేదని ఆయన పునరుద్ఘాటించాఉ. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగింది కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లనేనని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 2014 నుంచి తాము వ్యాట్‌ను పెంచలేదన్నారు. ”మీ ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లో మా చట్టబద్ధమైన హక్కు 41 శాతం వాటా రావడం లేదు. సెస్‌ పేరుతో రాష్ట్రం నుంచి మీరు 11.4 శాతం వాటాను లూటీ చేస్తున్నారు. 2022-23 ఏడాదిలో మాకు కేవలం 29.6 శాతం మాత్రమే వస్తోంది. దయచేసి సెస్‌ను రద్దు చేయండి. అపుడు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ రూ. 70కి, డీజిల్‌ రూ. 60కు వస్తుంది. వన్‌ నేషన్‌ – వన్‌ రేటు?” అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.