For Money

Business News

అంచనాలను అందుకున్న HUL

మార్చిత ముగిసిన త్రైమాసికంలో హిందుస్థాన్‌ యూనీ లివర్‌ (HUL) చక్కటి పనితీరును కనబర్చింది. మార్కెట్‌ అంచనాలను అందుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,327 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదిలో సాధించిన రూ. 2,143 కోట్ల నికర లాభం కన్నా ఇది 8.58 శాతం అధికం. మార్కెట్‌ రూ. 2180 కోట్ల నికర లాభం అంచనా వేసింది. ఇక కంపెనీ ఆదాయం కూడా 10.4 శాతం పెరిగి రూ. 11,947 కోట్ల నుంచి రూ. 13,190 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు కంపెనీ రూ. 19 డివిడెండ్‌ను రెకమెండ్‌ చేసింది. ఇప్పటికే గత నవంబర్‌లో రూ.15 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ చెల్లించింది. పూర్తి ఏడాదికి కంపెనీ టర్నోవర్‌ రూ. 50,000 కోట్లు దాటడం విశేషం.