For Money

Business News

మధ్యంతర ఎన్నికల ఎఫెక్ట్‌…

రేపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌, రాష్ట్ర అసెంబ్లీలు, గవర్నర్‌ ఆఫీసుల పనితీరుకు ఇదొక పరీక్ష. కాంగ్రెస్‌లో డెమొక్రటిక్‌లకు మెజారిటీ అంతంత మాత్రమే ఉంది. తాజా సర్వేల ప్రకారం అనేక రాష్ట్రాల్లో రిపబ్లికన్స్‌ ముందున్నట్లు వార్తలు వస్తున్నాయి.చాలా రాష్ట్రాల్లో పోటీ హోరాహోరీగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ వస్తే జొ బైడెన్ పాలన కష్టం కావొచ్చు. అలాగే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లపై ప్రభావం చూపవచ్చు. ఈ నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. యూరో మార్కెట్లు కూడా స్వల్ప లాభాలతో ఉన్నాయి. కొన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్‌ క్రితం ముగింపు వద్ద ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ మాత్రం 0.15 శాతం లాభంతో ఉండగా, డౌజోన్స్‌ 0.6 శాతం లాభంతో ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరుగుతోంది. బ్రెంట్‌క్రూడ్‌ ధర 98.50 డాలర్లను దాటింది.