For Money

Business News

హౌసింగ్ సేల్స్‌ 24 శాతం పెరిగాయి

సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో ఇళ్ళ అమ్మకాలు 1,08,817 యూనిట్లను ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలలో 87,747 యూనిట్స్‌ అమ్మారని, ఈ లెక్కన హౌసింగ్‌ సేల్స్‌ 24 శాతం పెరిగినట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ జసుజ అన్నారు. రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ రంగంలో కొత్తగా యూనిట్ల ప్రారంభం కూడా 11 శాతం పెరిగినట్లు తెలిపారు. జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 83241 కొత్త యూనిట్లు ప్రారంభమైనట్లు వెల్లడిచారు. హౌసింగ్‌ అమ్మకాల్లో థానే, పుణె, బెంగళూరు టాప్‌ త్రీలో ఉన్నాయి. థానేలో 21910, పుణెలో 20807, బెంగళూరులలో 15297 యూనిట్లను అమ్మినట్లు ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. కొత్త యూనిట్ల ప్రారంభంలో హైదరాబాద్‌ టాప్‌లో ఉంది. తరవాతి స్థానాల్లో థానే, పుణె ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ త్రైమాసికంలో 16931 యూనిట్లు కొత్తగా ప్రారంభం అయ్యాయి. ప్రధాన నగరాల్లో అన్‌సోల్డ్‌ స్టాక్‌ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం తగ్గిందని ప్రాప్‌ ఈక్విటీ పేర్కొంది.