For Money

Business News

ఆరంభ లాభాలు ఆవిరి… మళ్ళీ

జాబ్‌ డేటా ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా ఉందని అనుకున్నారు. జాబ్‌ డేటా మరీ గొప్పగా లేనందున మున్ముందు ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు జోరుగా ఉండకపోవచ్చని అనలిస్టులు అంటున్న నేపథ్యంలో వాల్‌ స్ట్రీట్‌ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. గంట కూడా కాకుండానే నష్టాల్లోకి జారకుంది. ఒకదశలో 10553ని తాకిన నాస్‌డాక్‌ వెనువెంటనే 10281ని తాకింది. దీంతో అర శాతం నష్టంలోకి జారుకుంది నాస్‌డాక్‌. ఎస్‌ అండ్‌ పీ 500 కూడా 0.15 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్‌ దాదాపు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. డాలర్‌ ఒక శాతం పెరిగింది. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పెరిగాయి. ఈ రెండూ బలహీనపడే పక్షంలో ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ వస్తుందని అనలిస్టులు అంటున్నారు. సూచీలు ఇప్పటికే భారీగా క్షీణించాయని చెబుతున్నారు. మరోవైపు జాబ్‌ డేటా పాజిటివ్‌గా రావడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధర భారీగా పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ 97 డాలర్లను దాటింది. డాలర్‌తో పాటు క్రూడ్‌ పెరగడం… భారత వంటి దేశాలకు భారమే. ఇక బులియన్‌ కూడా జిగేల్‌ అంది.