For Money

Business News

అంచనాలకు అనుగుణంగా…

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సిప్లా మార్కెట్‌ అంచనాలకు దీటుగా లాభాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో సిప్లా నికర లాభాలు రూ. 711 కోట్ల కాగా, ఈ ఏడాది నికర లాభం 10.9 శాతం పెరిగి రూ. 789 కోట్లకు పెరిగాయి. ఈటీ నౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న అనలిస్టులు సిప్లా నికర లాభం రూ. 790 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ అంచనాలకు మేరకు కంపెనీ ఫలితాలు ఉన్నాయి. కంపెనీ ఆదాయం 5.57శాతం పెరిగి రూ. 5,828 కోట్లకు చేరాయి. కంపెనీ కన్సాలిడేటెడ్‌ మార్జిన్స్‌22.1 శాతం. సిప్లా ప్రధానంగా రెస్పిరేటరీ, కార్డియో వాస్క్యులార్, ఆర్థరైటిస్, డయాబెటిస్, డిప్రెషన్ తదితర వ్యాధులకు మెడిసిన్స్ ను తయారు చేస్తుంది. అమెరికా మార్కెట్‌లో మాంద్యం వస్తున్నందున దేశీయంగా గట్టి మార్కెట్‌ ఉన్న ఫార్మా కంపెనీలను అనలిస్టులు సిఫారసు చేస్తున్నారు. వీటిల్లో సిప్లా ముందు ఉంది. ముఖ్యంగా రెస్పిరేటరీ విభాగంలో ఈ కంపెనీకి పోటీ చాలా తక్కువ. దీంతో ఈ షేర్‌ గత కొన్ని నెలలుగా పటిష్ఠంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ ఈ షేర్‌ ఎన్ఎస్ఈ లో రూ.1165 వద్ద ముగిసింది.